Saturday, November 23, 2024
HomeTrending Newsఢిల్లీతో సహా సమీప రాష్ట్రాల్లో కరోనా

ఢిల్లీతో సహా సమీప రాష్ట్రాల్లో కరోనా

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గతవారం రోజులుగా రోజువారీ కేసులు 3వేలకు ఎగువనే నమోదవుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 3,545 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఢిల్లీలో 1,365 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్ లైన్ లో పరీక్షలు నిర్వహించటంపై ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. కేసులు పెరుగుతున్న వేల పరీక్షలు ఆన్ లైన్ లోనే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గురువారం 4.65 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడచిన 24 గంటల్లో మొత్తం 3,545 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మరో 27 మందిని మహమ్మారి బలితీసుకుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణ వంటి రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు 40 రోజుల తర్వాత మహారాష్ట్రలో 200కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకూ దేశంలో4.30కోట్ల మందికిపైగా కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే, 24 గంటల వ్యవధిలో కొత్త కేసుల కంటే స్పల్పంగా కోలుకున్నవారు ఎక్కువున్నారు. మొత్తం 3,549 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసులు 19,688గా ఉన్నాయి. రికవరీ రేటు 98.74 శాతంగా ఉండగా.. క్రియాశీలక కేసులు 0.05 శాతంగా కొనసాగుతున్నాయి. కరోనాతో ఇప్పటి వరకూ 5.24 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 16.5 లక్షలమంది టీకా తీసుకోగా.. 189 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.76 శాతానికి చేరుకోగా.. వీక్లీ పాటిజివిటీ రేటు 0.79కి చేరుకోవడం గమనార్హం.

Also Read : కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు.. కేంద్రం హెచ్చరిక 

RELATED ARTICLES

Most Popular

న్యూస్