Saturday, November 23, 2024
HomeTrending Newsచైనాలో కరోనా ఉపద్రవం...దీనావస్థలో ప్రజలు

చైనాలో కరోనా ఉపద్రవం…దీనావస్థలో ప్రజలు

నేరం నిరూపణ అయిన వారిని జైలు కు పంపిస్తారు. జైలు కు వెళ్ళాక కూడా అక్కడ కూడా నేరాలు చేస్తే ? { తోటి ఖైదీల పై దాడి చెయ్యడం లాంటివి }. అలాంటి వారిని సోలిటరీ confinement కి గురి చేస్తారు అంటే ఏకాంతంగా బంధించడం. జైలు ఆఫీసర్ లు చెప్పడం ఏమిటంటే ఎంతటి కరుడు కట్టిన ఖైదీ అయినా ఇలాంటి శిక్ష విధిస్తే నెల రోజుల్లో బ్రేక్ అయిపోతాడు. పొద్దునుంచి రాత్రి దాక మాట్లాడడానికి ఎవరూ వుండరు. పిచ్చెక్కి పోతుంది.

సరిగ్గా చైనా లో కొన్ని నెలల పాటు ఇదే చేసారు. ప్రతి అపార్ట్మెంట్ లో టేప్ లు వేసి దాని దాటి బయటకు ఎవరూ వెళ్లకూడదని కట్టడి. బయట కెమెరాలు. అక్కడ కనిపిస్తే ఇక జైలే. నెలల తరబడి ఇంట్లో బందీలుగా ప్రజలు. ఫుడ్ ఎప్పుడుస్తుందో తెలియదు. వచ్చింది ఎలా ఉంటుందో తెలియదు. ఆకలితో నకనక లాడుతూ ప్రజలు. కొన్ని నెలల పాటూ పోషకాహార లోపం. దీనితో ఇమ్మ్యూనిటి దారుణంగా దెబ్బ తింది.

మనిషి సంఘ జీవి. కొన్ని నెలలపాటు బయటకు వెళ్లకుండా మాట్లాడడానికి బయటి వారు ఎవరూ లేకుండా పోవడంతో జనాల మానసిక స్థితి విపరీతం అయిపొయింది. కొంత మంది పిచ్చి పట్టినట్టు వ్యవహరించారు. అఘాయిత్యాలు చేసారు. సైకో ప్రపంచం అయిపొయింది. జీరో కోవిద్ పేరుతొ ప్రభుత్వం ఇలా కట్టడి చేయడాన్ని ప్రజలు సహించలేక పోయారు. ఒక పక్క తమ చుట్టూరా అసిమ్పటోమాటిక్ కేసులు. లేని రోగానికి ఇన్ని నిభందనలా అంటూ నిరసన ప్రదర్శనలు చేసారు. దీనితో ప్రభుత్వానికి… అంటే పాలకులకు మండిపోయింది. మీ తిక్క కుదరాలి అన్నట్టు ఒక్కసారిగా నిబంధనలు ఎత్తేసింది. నైట్ మార్కెట్ లతో సహా అన్నీ తెరుచుకున్నాయి. ఇంట్లో నెలల పాటు బందీలుగా గడిపిన ప్రజలు ఒక్క సారిగా రోడ్ ల పై పడ్డారు. కరోనా వచ్చిన వారు కూడా రోడ్డ్లపైకి వచ్చేసారు. జనాలకు తిక్క కుదర్చాలని ప్రభుత్వమే ఎనభై వేల మంది కోవిద్ రోగులను బయటకు వదిలినట్టు ఒక వార్త. ఇది ఖచ్చితంగా నిజం అని చెప్పలేము.

బయటకు వచ్చిన కోవిద్ రోగులు పైశాచిక ఆనందం అనండి నెలల తరబడి ఇంట్లో బందీలుగా కావడం వల్ల సైకో లుగా మారడం వల్ల కానివ్వండి కావాలనే రోడ్డుల పై ఉమ్మడంలాంటివి చేసారు. అంతకంటే ఘోరం ఏమిటంటే ఫుడ్ డెలివరీ చేసే ఉద్యోగంలో ఉన్న కోవిద్ రోగులు ఫుడ్ లో ఉమ్మడం లాంటివి చేసారు. ఫుడ్ పార్సెల్ తెప్పించుకొంటే అందులో కరోనా రోగి ఉమ్మి తప్పకుండా ఉంటుంది అనేటట్టు పరిస్థితి తయారయ్యింది. కోవిద్ రోగి ఉమ్మి చేసిన ఫుడ్ ను తింటే ఎక్కువ వైరల్ లోడ్ ఆ ఫుడ్ తిన్న వ్యక్తులకు వెళ్లి పోతుంది. చైనాలో ఇదే జరిగింది .. డిసెంబర్ మొదటి వారం జీరో కోవిద్ పాలసీని ప్రభుత్వం ఎత్తేసాక అడ్డు అదుపు లేకుండా కేసులు పెరిగి పోతున్నాయి. ఒకప్పుడు నూటికి ఎనభై అసిమ్పటోమాటిక్ కేసులు. ఇప్పుడు దాదాపు అన్నీ సైమ్పటోమాటిక్ కేసులే. అంటే రోగ లక్షణాలు బయట పడుతున్నాయి. మందులు దొరకడం లేదు. పూటకు మన కరెన్సీ లో మూడు వేలు పెట్టిన ఫుడ్ దొరకని స్థితి.

మనం ఊదేసిన ఓమిక్రాన్ లేదా దాని వేరియంట్ బిఎఫ్ 7 కె చైనీయులు ఎందుకు అంతా డీలా పడిపోతున్నారు ?

విపరీతమైన ఒళ్ళు నొప్పులు. ఎంతటి నొప్పేంటే ఒక మహిళ ఒళ్ళు నొప్పి తట్టు కోలేక అపార్ట్మెంట్ పైకి ఎక్కి దూకేసిందట. ఎందుకిలా ? డి విటమిన్ లోపం ఉన్న వారికి కరోనా సోకితే ఒళ్ళు నొప్పులు వస్తాయి. రోజూ అరగంట ఎండ లో నడిస్తే / కూర్చుంటే డి విటమిన్ ఫ్రీ గా వస్తుంది. చైనీయులు నెలల తరబడి ఇంట్లో బందీలు. ఒంట్లో డి విటమిన్ అడుగంటి పోయింది. ఇప్పుడేమో విరిపరీతమైన చలి. చైనా చాల పెద్ద దేశం. అనేక ముఖ్య నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు పది దాటడం లేదు. వారికేమో రాత్రి పూట చలిలో నైట్ మార్కెట్ కు వెళ్లే అలవాట్లు. అంటే డి విటమిన్ లేదు. పైగా శీతల వాతావరణం. ఒక పక్క నెలల తరబడి పోషకాహారం లేకుండా ఇమ్మ్యూనిటి చచ్చింది. దీనికి తోడు విపరీతమైన స్ట్రెస్. అంటే అన్ని విధాలుగా ఇమ్మ్యూనిటి దెబ్బతింది. ఇదే సమయంలో ఉమ్ములు వేసుకోవడం లాంటి వల్ల హై వైరల్ లోడ్ సోకుతోంది.

ఏమి జరగకూడదో సరిగ్గా అదే జరుగుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా లాక్ డౌన్ లు లాంటివి. అంటే ప్రజలే బయటకు రావడం లేదు. మందులు దొరకవు. జలుబు దగ్గు అన్నిటికీ మించి విపరీతమైన ఒళ్ళు నొప్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

“మీ తిక్క కుదిరింది. మేము లాక్ డౌన్ పెడితే వ్యతిరేకిస్తారా?” అన్నట్టుగా ఉంది పాలకుల వైఖరి. మరో నెలరోజుల పాటు చైనాలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు.

-వాసిరెడ్డి అమర్ నాథ్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్