Friday, March 28, 2025
HomeTrending Newsకొత్తగా 2,86,384 కేసులు నమోదు

కొత్తగా 2,86,384 కేసులు నమోదు

Corona Third Wave Continues In India :

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,86,384 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,71,500 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,02,472 కు చేరింది. దేశంలో రోజు వారి కరోనా పాజిటివిటి రేటు 19.59 శాతంగా ఉంది. అలాగే దేశంలో యాక్టివ్ కేసుల శాతం 5.46 శాతంగా నమోదు అయింది.  తాజాగా 573 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,91,700 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,06,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,76,77,328 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,63,84,39,207 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో 22,35,267 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్