Tuesday, March 19, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఇప్పుడే గుర్తొచ్చిందా?: సోము

ఇప్పుడే గుర్తొచ్చిందా?: సోము

Public opinion: రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తెచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని, రెండున్నరేళ్ళ కాలంలో ఏం చేశారని ప్రశ్నించారు. కుటుంబ పార్టీల విధానాలు ఇలాగే ఉంటాయన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని అయితే ప్రభుత్వ చిత్తశుద్దిని మాత్రమే తాము తప్పుబడుతున్నామన్నారు.  కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల ఆందోళనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏయే ప్రాంతాలు ఏయే జిల్లాల్లో ఉండాలి, వాటికి ఏయే పేర్లు పెట్టాలి, జిల్లా కేంద్రాలుగా వేటిని ఉంచాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో సోము మాట్లాడారు.

రాష్ట్రంలో రోడ్లు, బస్ స్టాండ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే జిల్లాకో ఎయిర్ పోర్ట్ అని సిఎం చెప్పడం హాస్యాస్పదమని సోము వ్యాఖ్యానించారు.  ముందు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో పంచాయతీ రాజ్ రోడ్లు వేయాలని సూచించారు.

Also Read : వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్ట్ : సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్