Saturday, November 23, 2024
HomeTrending Newsజర్మనీ, రష్యాల్లో కరోనా కల్లోలం

జర్మనీ, రష్యాల్లో కరోనా కల్లోలం

Corona Upheaval In Germany :

జర్మనీ దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నాలుగో దశ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక రోజే 76,414  కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైనప్పటి నుంచి జర్మనీలో ఇంత భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడటం ఇదే ప్రథమం. 24 గంటల్లో 357 మంది మృత్యువాత పడ్డారు. అంతకు ముందు రోజు( బుధవారం ) కూడా 76 వేల కేసులు నమోదు కాగా 351 మంది చనిపోయారు. రాజధాని బెర్లిన్ తో సహా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. అటు రష్యాలో 35 వేల కేసులు నమోదు కాగా 1235 మంది చనిపోయారు.

దక్షిణాఫ్రికా, బోట్స్ వాన దేశాల్లో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై ప్రపంచ దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికులకు తప్పనిసరిగా స్ర్కీనింగ్‌, కొవిడ్‌ పరీక్షలు పకడ్బందీగా చేయాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌ నుంచి వచ్చేవారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. B.1.1529 పేరు గల ఈ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో అసాధారణ రీతిలో మ్యుటేషన్లకు గురవుతోందని, ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే 22 కేసులను గుర్తించినట్లు వెల్లడించింది.

కొత్త వేరియంట్ వాస్తవమేనని అటు హాంకాంగ్ కూడా ద్రువీకరించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి ద్వారా మరొకరికి వచ్చిందని, వారిద్దరిని క్వారంటైన్ లో ఉంచినట్టు హాంకాంగ్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. B.1.1529 వేరియంట్ రావటానికి కారణం పూర్తిగా తెలియలేదు. ఆయితే వాడిన మాస్క్ నే తిరిగి వాడటంతో వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త కేసులు వెలుగు చూడటంతో మొత్తం నాలుగు కేసులు అయ్యాయి.

Also Read  : జర్మనీలో కరోనా విశ్వరూపం

RELATED ARTICLES

Most Popular

న్యూస్