Friday, March 29, 2024
HomeTrending Newsజర్మనీలో కరోనా విశ్వరూపం

జర్మనీలో కరోనా విశ్వరూపం

Corona Epidemic Is Spreading Again :

కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో మళ్ళీ వ్యాపిస్తోంది. యూరోప్, దక్షిణ, ఉత్తర అమెరికా ఖండాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అయితే కరోనాతో చనిపోయే వారి సంఖ్య తక్కువగా ఉండటం కొంతలో కొంత ఉరటనిస్తోంది.

జర్మనీలో రోజుకు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో నిన్న సుమారు 250 మంది చనిపోయారు. నాలుగో వేవ్ ఇదే రీతిగా విస్తరిస్తే పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. సాక్సోనీ, తురిన్గియా,బవేరియా తదితర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో గుమికూడటం, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రెండు డోసుల టీకా తీసుకున్న వారినే దేశంలోకి అనుమతిస్తున్నారు.

రష్యాలో రోజుకు 40 వేల కేసులు వస్తున్నాయి. మహమ్మారితో నిన్న 1241 మంది చనిపోయారు. కోవిడ్-19 ప్రారంభం అయ్యాక రష్యాలో పెద్ద సంఖ్యలో చనిపోవటం ఇదే ప్రథమం. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరణ అధికంగా ఉంది.

కెనడాలో రోజుకు సుమారు రెండున్నర  వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒకరోజే మూడు వేల పైచిలుకు కేసులు వెలుగు చూశాయి. రోజుకు 50 మంది వరకు కరోనాతో మృత్యువాత పడుతున్నారు. శీతాకాలం, కోవిడ్ నిభందనలు సడలించటంతో కేసులు పెరుగుతున్నాయని కెనడా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒంటారియో,క్విబెక్, బ్రిటిష్ కొలంబియా రాష్ట్రాల్లో కేసులు అధికంగా ఉన్నాయి. ఈ దఫా చిన్నారుల్లో కూడా కరోనా లక్షణాలు వెలుగు చూడటం ఆందోళనకరంగా ఉందని కెనడా ప్రభుత్వం వెల్లడించింది.

చైనాలో 21 రాష్ట్రాలకు కరోనా విస్తరించింది. రోజుకు వెయ్యి కేసులు వస్తున్నాయని, 20 మంది లోపే చనిపోతున్నారని చైనా ప్రభుత్వం ప్రకటించింది. అధికారికంగా వెయ్యి కేసులు అని వెల్లడిస్తున్నా అనధికారికంగా లెక్కకు మించి కేసులు వస్తున్నాయని సమాచారం. నగరాలలోని మురికివాడల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని, చనిపోయే వారి వాస్తవిక సంఖ్య చైనా కమ్యునిస్టు ప్రభుత్వం చెప్పటం లేదని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు అనుమానిస్తున్నాయి.

Also Read :  జర్మనీలో పెరుగుతున్న కరోనా కేసులు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్