కరోనా వ్యాక్సినేషన్‌లో ఇండియా మరో మైలురాయిని అందుకుంది. 2-18 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం కొవాగ్జిన్ ( Covaxin )వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటికే 18 ఏళ్ల వయసులోపు పిల్లలపై రెండు, మూడో దశల ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి డేటాను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది.