Saturday, July 27, 2024
HomeTrending Newsవిద్యుత్ ప్రాజెక్టులపై జగడం

విద్యుత్ ప్రాజెక్టులపై జగడం

కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్‌ జలసౌధలో ఈ రోజు గోదావరి, కృష్టా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) లు రెండింటి సమావేశం జరిగింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎం.పి.సింగ్ అధ్యక్షతన బోర్డు భేటీ జరగగా నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్‌ కుమార్ పాల్గొన్న ఈఎన్‌సీ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖఈ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం ఏది తీసుకోలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యెక కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు.

రెండో షెడ్యూల్‌లోని అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లను బోర్డు పరిధిలోకి తీసుకోనున్నట్లు కేఆర్‌ఎంబీ తెలిపింది. బోర్డు పరిధిలోకి తెలంగాణలో 7 ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 12 ప్రాజెక్టులు రానున్నాయి.  విద్యుత్ పంప్ హౌసుల్ని కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కోరగా తెలంగాణ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టుల అన్ని డైరెక్ట్‌ అవుట్‌లెట్లు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. అవుట్‌లెట్ల అప్పగింతకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని కేఆర్‌ఎంబీ కోరింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్