అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ వేరియంట్ల వివరాలు కలవరపరుస్తున్నాయి. డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యమంత్రిత్వ వర్గాలు వెల్లడించాయి. నమోదైన అన్ని కూడా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లేనని స్పష్టం చేశారు.
మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేయగా..124 మందికి పాజిటివ్ గా తెలినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు.. ఒక శాంపిల్‌లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు.