7.2 C
New York
Monday, December 11, 2023

Buy now

Homeసినిమాకాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

సీనియర్ నటుడు, నిర్మాత, కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కెరీర్ మొదట్లో సినిమాలకు కాస్ట్యూమ్స్ అందించిన ఆయన అడపా దడపా చిన్న చిన్న పాత్రలు పోషించేవారు. కానీ కోడి రామకృష్ణ రూపొందించిన ‘భారత్ బంద్’ సినిమాలో ప్రధాన విలన్ గా నటించి మెప్పించారు. ఆ తర్వాత నటుడిగా చాలాకాలంపాటు బిజీ అయ్యారు. మీనా, హరీష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆడవాళ్ళకు మాత్రమే’ సినిమాలో హీరో తండ్రి పాత్రలో కూడా ఆయన నటన తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. విలక్షలమైన కంఠం, డైలాగ్ డెలివరీ ఆకట్టుకునేవి.

జగపతిబాబు హీరోగా నటించిన పెళ్లి పందిరి సినిమాతో నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆ తరువాత అనారోగ్యంతో చెన్నైకే  పరిమితమయ్యారు. కృష్ణ మృతిపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్