‘రావణాసుర’లో ఎవరు విలన్? ఎవరు హీరోయిన్?

టాలీవుడ్ లో ఇప్పుడు అంతా ‘రావణాసుర’ సినిమాను గురించి మాట్లాడుకుంటున్నారు. రవితేజ ఇంతకుముందు చాలా సినిమాలు చేశాడు. తన మార్క్ యాక్షన్ తో పాటు కామెడీ టచ్ .. రొమాంటిక్  టచ్ ఉన్న పాత్రలను చేస్తూ వచ్చాడు. ఇక కథ ఏదైనా .. పాత్ర ఏదైనా ఆయన తాలూకు ఎనర్జీ అదే  లెవెల్లో వెళుతూ ఉంటుంది. అలాంటి రవితేజ నుంచి ఈ నెల 7వ తేదీన రావడానికి ‘రావణాసుర’ సినిమా రెడీ అవుతోంది.

సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరగడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమాలో రవితేజ టైటిల్ కి తగినట్టుగానే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించాడనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ప్రమోషన్స్ లో ఆయన ఈ మాటను చెప్పాడు కూడా. ప్రతినాయకుడి లక్షణాలతో రవితేజ పాత్ర కనిపిస్తున్నప్పటికీ, ఈ కథకి ఆయనే నాయకుడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.

విలన్ పనులను ఆయనే చేస్తున్నప్పుడు మరి అసలు విలన్ ఎవరు? అనేదే ఆడియన్స్ కి అంతుబట్టడం లేదు. రావు రమేశ్ .. జయరామ్ .. సంపత్ రాజ్ .. మురళీశర్మ వంటి పెద్ద తలకాయలు ఆయన చుట్టూ కనిపిస్తున్నాయి. హీరోను రావణాసురగా మార్చిన వారు వీళ్లలో ఎవరు? అనేదే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇక రావణాసురలో ఐదుగురు ముద్దుగుమ్మలు కనిపిస్తున్నారు. రావణాసుర పాత్రలో అంత రొమాంటిక్ యాంగిల్ ఉందా? అనేది మరో సందేహం. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రిలీజ్ రోజున ఆ సినిమా ఆడే థియేటర్స్ చెప్పాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *