Monday, May 20, 2024
HomeTrending NewsVandeBharat:తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు

VandeBharat:తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలు

భాగ్యనగరం హైదరాబాద్ నుండి ఆధ్యాత్మిక నగరం తిరుపతిని సందర్శించనున్న వారికి అనుకూలంగా వందేభారత్ రైలు సేవలు ఈ నెల 8 వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనున్న ఈ  రైలు… ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగనుంది. మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని.. ఈ నెల 8 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాల మధ్యన సేవలందించనున్న 2 వ వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నందు జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, సికింద్రాబాద్ – తిరుపతి మధ్యన ఈ రైలు తన సేవలనందించనున్నట్లు తెలిపారు. భాగ్యనగరం హైదరాబాద్, ఆధ్యాత్మిక నగరం తిరుపతికి మధ్యన ప్రయాణించే వారికి అనుకూలంగా ఈ రైలు తన సేవలను అందించనుందని, భాగ్యనగర వాసులకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం సికింద్రాబాద్, తిరుపతి మధ్యన ప్రయాణానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా, వందేభారత్ రైలు ద్వారా కేవలం 8 గం. ల 30 ని. లలోనే గమ్యస్థానాలను చేరుకోవచ్చు. వందేభారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగనుంది. క్రింద పట్టికలో సూచించిన విధంగా వందేభారత్ రైలు ఆయా స్టేషన్లలో ఆగనుంది.
20701
సికింద్రాబాద్ – తిరుపతి

రైల్వే స్టేషన్
20702
తిరుపతి – సికింద్రాబాద్

చేరుకునే సమయం
బయలుదేరు సమయం

చేరుకునే సమయం
బయలుదేరు సమయం


06:00
సికింద్రాబాద్
23:45

07:19
07:20
నల్గొండ
22:10
22:11

09:45
09:50
గుంటూరు
19:45
19:50

11:09
11:10
ఒంగోలు
18:30
18:31

12:29
12:30
నెల్లూరు
17:20
17:21

14:30

తిరుపతి

15:15

660.77 కి. మీ. లు
దూరం
660.77 కి. మీ. లు

08 గం. ల 30 ని. లు
ప్రయాణ సమయం
08 గం. ల 30 ని. లు

77.73 కి. మీ./గం.
సగటు వేగం
77.73 కి. మీ./గం.

ఈ నెల 8 వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ నుండి ఉదయం 11 గం. ల 30 ని. లకు బయలుదేరనున్న వందేభారత్ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగనున్నది. క్రింద పట్టికలో సూచించిన విధంగా ప్రారంభోత్సవం రోజున ఆయా స్టేషన్లకు చేరుకోనున్నది.
స్టేషన్
చేరుకునే సమయం
బయలుదేరే సమయం

సికింద్రాబాద్ – 11:30 నల్గొండ 13:05 13:10 మిర్యాలగూడ 13:40 13:45 పిడుగురాళ్ళ 14:30 14:35

గుంటూరు 15:35 15:45 తెనాలి 16:15 16:20 బాపట్ల 16:50 16:55 చీరాల 17:10 17:15 ఒంగోలు 17:50 17:55

నెల్లూరు 19:10 19:15 గూడూరు 19:35 19:40 తిరుపతి 21:00 –

ప్రారంభోత్సవం రోజున మేక్ ఇన్ ఇండియా వందేభారత్ రైలు ఆగనున్న అన్ని స్టేషన్లలో స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం తెలపాలని కిషన్ రెడ్డి కోరారు.

అత్యధిక సామర్థ్యంతో, ప్రయాణికులకు అద్భుతమైన ప్రయాణ అనుభాతిని కలిగించేలా 400 వందేభారత్ రైళ్లను తయారు చేయాలని ప్రకటించిన భారతీయ రైల్వే, అధునాతనమైన కోచ్ లతో, వేగవంతమైన సేవలను, ప్రయాణ అనుభూతిని ప్రయాణికులకు అందించాలన్న లక్ష్యంతో ఈ రైళ్లను ప్రారంభించడం జరుగుతోంది. అత్యంత వేగంగా వేగాన్ని అందిపుచ్చుకోవడం, రాబోయే స్టేషన్ల సమాచార ప్రకటన, GPS వ్యవస్థతో కూడిన ప్రయాణికుల వివరాలు, ఆటోమేటిక్ గా తెరుచుకునే తలుపులు, ముడుచుకునే మెట్లు, బయో టాయిలెట్లు వంటి అధునాతన సదుపాయాలతో పాటు కవచ్ వంటి ఆధునిక భద్రతా సౌకర్యాలను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వందేభారత్ రైళ్లలో కల్పించడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్