Saturday, June 13, 2026
HomeTrending Newsచారిత్రాత్మకమైనది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – సీఎస్ సోమేశ్ కుమార్

చారిత్రాత్మకమైనది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – సీఎస్ సోమేశ్ కుమార్

జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యత, భవిష్యత్ తరాల బాగుకోసం, ప్రకృతి పట్ల అవగాహనతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు.

భారత దేశ చరిత్రలో ఇంత భారీయెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిపట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న ఈ వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటడం.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మానసపుత్రిక “హరిత హారానికి” మరింత ముందుకు తీసుకుపోతుందన్నారు. ఇంత మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి, నా పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గోనే అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆద్యులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు “హరిత హారం”లో అదే విధంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొని మొక్కలు నాటాలని ప్రజలకు సోమేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular