Sunday, June 7, 2026
HomeTrending Newsయేసంగిలో మినుము సాగు లాభదాయకం

యేసంగిలో మినుము సాగు లాభదాయకం

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి  చేశారు. ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండని, పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి వెల్లడించారు. మార్క్ ఫెడ్ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాలకవర్గ సభ్యుల సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి  సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్క్  ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ పి.యాదిరెడ్డి మరియు ఇతర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని, మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300 లకు మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందని మంత్రి చెప్పారు. మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువగా ఉంటె ఆ ధరకు కొనడానికి ప్రభుత్వం సిధ్దమన్నారు. అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, దేశ వ్యాప్తంగా మినములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందని, నిన్ననే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి  లిఖితపూర్వక హామీ నాఫెడ్ సంస్థ ఇచ్చిందని మంత్రి తెలిపారు. మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత  హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు పెంచడానికి చేపట్టిన చర్యలపై రాష్ట్రంలో పని చేస్తున్న 11 ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో సమీక్ష సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి , ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular