Current Cuts : దేశవ్యాప్తంగా తీవ్రమైన బొగ్గు కొరతతో చాలా రాష్ట్రాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలు తగ్గాయి , ధర్మల్ విద్యుత్ కు అవసరమైన బొగ్గు ధరలు బాగా పెరిగాయి. సింగరేణి లాంటి బొగ్గు గనులు ఉన్నా దేశీయ అవసరాలు తీరటం లేదు. జర్సుగూడ, జాజపూర్ కియోంఝార్ బొగ్గు గనులు ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోనూ కరెంట్ కోతలు ఉంటున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ కొరత అధిగమించడానికి పరిశ్రమలను వారానికి ఒకరోజు మూసివేయాలని ప్రభుత్వం పవర్ హాలిడే ప్రకటించింది.
మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో పవర్ కట్. చెన్నైలో ఉదయం 9 నుంచి మద్యాహ్నం 2 వరకు పవర్ కట్. బెంగళూరులో కొన్ని ప్రాంతాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5వరకూ పవర్ కట్ ఇలా ఒకో రాష్ట్రంలో ఒకో విధంగా విద్యుత్ ఇబ్బందులు ఉన్నాయి. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో పవర్ గ్రిడ్ లపై చైనా నుంచి కొందరు హ్యాక్ చేయటంతో సమస్యలు మరింత్ పెరుగుతున్నాయి. కరెంట్ కోతలు అనేవి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగా చాల రాష్ట్రాల్లో తాత్కాలికంగా కొన్ని రోజులు ఈ కరెంట్ కోతల ఇబ్బందులు తప్పకపోవచ్చు.