Friday, March 20, 2026
Homeస్పోర్ట్స్CWG-2022: Women Hockey : ఘనాపై 5-0తో ఇండియా విజయం

CWG-2022: Women Hockey : ఘనాపై 5-0తో ఇండియా విజయం

కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళల హాకీ విభాగంలో ఇండియా తన తొలి మ్యాచ్ లో ఘనా పై ­5-0తో ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది.

ఆట మూడో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ సాధించి బోణీ కొట్టింది. 28వ నిమిషంలో నేహా,36వ నిమిషంలో సంగీత కుమారి చెరో గోల్ చేశారు. 39వ నిమిషంలో గుర్జీత్ రెండో గోల్ సాధించి ఇండియా స్కోరును 4-0కు తీసుకెళ్ళింది. ఆట చివరి భాగంలో 56వ నిమిషంలో సలీమా మరో గోల్ సాధించడంతో ఇండియా 5-0తో విజయం సాధించింది.

రేపు భారత మహిళల జట్టు వేల్స్ తో తలపడనుంది. కాగా భారత పురుషుల హాకీ జట్టు తన తొలి మ్యాచ్ ను రేపు ఘనా జట్టుతో ఆడనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular