Wednesday, March 18, 2026
Homeస్పోర్ట్స్ఏపీ క్రీడామంత్రి రోజాతో ఆశా మాలవ్య భేటీ

ఏపీ క్రీడామంత్రి రోజాతో ఆశా మాలవ్య భేటీ

మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్ పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య ను రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్.కె.రోజా అభినందించారు. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. సచివాలయంని తన చాంబరులో నున్న మంత్రిని ఆశామాలవ్య నేడు మర్యాదపూర్వకంగా కలిసారు. తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్ని మంత్రికి విరించారు.

ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రతకు, మహిళా సాధికారత సాధనకు జనగన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. కిశోరబాలికలు ఎటు వంటి ఆటంకం లేకుండా తమ విద్యను కొనసాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే నాణ్యమైన న్యాప్కిన్లు, నాడు-నేడు పథకం క్రింద పాఠశాలల్లో టాయిలెట్ల అభివృద్ది, నిర్వహణ మరియు మహిళల రక్షణ, భద్రతకై దిశా యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో పాటు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు తదితర కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు మంత్రి ఆశా మాలవ్యకు వివరించారు. ఎటు వంటి అవసరం ఉన్నా సరే అన్నివిధాలుగా సహకరించేందుకు తాను సిద్ధంగా  ఉన్నట్లు మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు.

ఆశా మాలవ్య మాట్లాడుతూ తాను మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి అని, సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని, నవంబర్‌ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించి ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర పూర్తిచేయడం జరిగిందని మంత్రికి వివరించారు.  తన సైకిల్ యాత్రకు ఆంద్రప్రదేశ్ లో మంచి ఆధరణ లభించిందని, అటు వంటి ఆధరణ తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా లభించలేదని మంత్రికి తెలిపారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచంధన్ ను, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని తాను మర్యాదపూర్వకంగా కలిసినపుడు వారు ఎంతగానో తనను ఆదరించారని, రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆశా మాలవ్యకు బొబ్బిలి వీణను బహూకరించి మంత్రి రోజా సత్కరించారు.

Also Read : చెస్ ప్లేయర్ మీనాక్షికి కోటి రూపాయల కార్పస్ ఫండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular