Monday, May 20, 2024
HomeTrending Newsబడ్జెట్ మీద అబద్ధాలు - ఈటల రాజేందర్

బడ్జెట్ మీద అబద్ధాలు – ఈటల రాజేందర్

గవర్నర్ ప్రసంగం మీద ktr, బడ్జెట్ మీద హరీష్ రావు మూడు మూడు గంటలు మాట్లాడారు. మా గొంతు నొక్కేశారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అసెంబ్లీనీ వారి ఎల్పీ ఆఫీస్ లాగా మార్చారని మండిపడారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన ఈటల రాజేందర్ ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తి పోశారు. మాఇంటి పేరు కస్తూరి వారు మా ఇల్లంతా గబ్బిలాల వాసన అన్నట్టు ఉంది వీరితీరు అని ఈటల రాజేందర్ అన్నారు.

ఈటల రాజేందర్ విమర్శలు ఆయన మాటల్లోనే…

హరీష్ రావు ప్రసంగం అంత అబద్ధాలతో నిండిపోయింది. బడ్జెట్ మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నాను. 13 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మకం ద్వారా వస్తాయి అనడం తప్పుల. 25 వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం అసిస్టెంన్స్ వస్తుంది అని పెట్టారు అది ఫార్స్. జిఎస్టి కాంపెన్సేషన్ ఒక అబద్ధం. ఇలా 55 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అక్రమంగా పెట్టి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యంత వేగంగా అప్పులు చేస్తున్న రాష్ట్రం. ఎఫ్ఆర్బిఎం, గ్యారెంటీ రుణాలు కలిపి అప్పు ఐదు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు చేరుకుంది. GSDPలో అప్పు 38% చేరుకుంది. అప్పట్లో విశ్వవిద్యాలయాల్లో బ్రహ్మాండమైన భోజనం పెట్టేవారు ఒక రూపాయి కూడా విద్యార్థి మీద భారం పడకుండా చదువుకున్నవాళ్ళం మేము. కానీ ఇప్పుడు విశ్వవిద్యాలయాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే దారుణంగా మార్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మీకు దమ్ముంటే విశ్వవిద్యాలయాలకు పోదాం రండి.

ఆర్టీసీ కార్మికులు పేదవారు. వారికి రెండు పీఆర్సీలు రాలేదు. డ్రెస్ కోడ్ ఉన్న ఉద్యోగులకు కూడా మొదటివారం జీతాలు రావడం లేదు. మూడు లక్షల కోట్ల బడ్జెట్ భూటకం కాకపోతే ఎందుకు ఫస్ట్ తారీకు రోజు మీరు జీతాలు ఇవ్వడం లేదు. మీరు ఎన్నికల కోసం మాత్రమే పనిచేస్తారు అనడానికి మునుగోడు ఉప ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. ఒక లక్ష యాభై నాలుగు వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. కానీ ఎన్నికలు అవ్వగానే వేయలేదు. 11 వేలకోట్ల రూపాయలు NCDC కింద రుణం తీసుకున్నారు. దమ్ముంటే, నిజాయితీ ఉంటే, గొల్ల కురుమల మీద ప్రేమ ఉంటే నేరుగా వారి బ్యాంకు ఎకౌంట్లో డబ్బులు వేయండి తప్ప బ్రోకర్లపాలు చేయవద్దు.

గొప్పదని చెప్తున్న కాలేశ్వరం ప్రాజెక్టును కూడా చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటే అర్ధం ఎంటి ? మాటలగారడీతో అసెంబ్లీని కూడా సొంతపార్టీ కార్యాలయంగా మార్చుకొని ప్రతిపక్ష నేతల గొంతునొక్కుతున్నారు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు. మా పట్ల సానుభూతిగా ఉండాల్సిన స్పీకర్ మావైపు చూడకుండా ఉండటాన్ని తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది.

Also Read : 2023-24కి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్