Wednesday, September 25, 2024
HomeTrending Newsజీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

జీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖలో లుకలుకలు మరోసారి బైటపడ్డాయి. ఇప్పటివరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న నేతల మధ్య అసమ్మతి, అసంతృప్తి స్వరాలు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాతో ఊపందుకున్నాయి. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు… వంగవీటి మోహనరంగా ప్రధాన ఆయుధంగా కాపు సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టి సారించి వారి మెప్పు పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యసభలో కాపు రిజర్వేషన్స్ అంశాన్ని ప్రస్తావించిన జీవీఎల్… నాలుగురోజుల క్రితం గన్నవరం విమానాశ్రయానికి రంగా పేరు పెట్టాలని రాజస్యభలో కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అదే సందర్భంలో కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన డిమాండ్ చేశారు.

ఇక్కడితో ఆగకుండా రాష్ట్రంలో రెండు కుటుంబాలు, రెండు పార్టీలు తమ ప్రాబల్యం పెంచుకోవడానికే  పని చేస్తున్నాయని, పథకాలు, ప్రాజెక్టులు అన్నింటికీ వైఎస్సార్, ఎన్టీఆర్ పేరే పెడుతున్నారని, ‘ ఆ ఇద్దరే’నా, మరో నాయకుడు లేరా అంటూ ప్రశ్నించారు. ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు అంటూ ప్రశ్నించారు.

దీనిపై పురంధేశ్వరి అదే స్థాయిలో స్పందించారు.

“ ఆ ఇద్దరు కాదు, ఆ మహానుభావులు” అంటూ ఓ ట్వీట్….

“అన్నీ ఇద్దరి పేర్లేనా”… “ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం– 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు” అంటూ మరో ట్వీట్ చేసి జీవీఎల్ కు కౌంటర్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ ట్వీట్ బిజెపిలో మరో రచ్చ, చర్చకు దారితీస్తోంది. ఇప్పటికైనా కేంద్ర పార్టీ ఈ విషయంలో ఓ స్పష్టత రాష్ట్ర నాయకత్వానికి ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్