Saturday, June 29, 2024
Homeసినిమాబాక్సింగ్ కింగ్ బయోపిక్ పై దృష్టి పెట్టిన రానా? 

బాక్సింగ్ కింగ్ బయోపిక్ పై దృష్టి పెట్టిన రానా? 

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలుగానీ .. వెబ్ సిరీస్ లు గాని బయోపిక్ ల దిశగా పరిగెడుతున్నాయి. ఇలా చేసిన ప్రయత్నాలు చాలా వరకూ సక్సెస్ అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో రానా కూడా ఒక ఒక బయోపిక్ పై దృష్టి పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. హీరోగానూ .. విలన్ గాను రానా తన సత్తా చాటుకున్నాడు. ‘బాహుబలి’ సినిమా .. ‘రానా నాయుడు’ సిరీస్ కారణంగా ఆయనకి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. ఇక నిర్మాతగాను ఆయన తన స్పీడ్ పెంచడానికి రెడీ అవుతున్నాడు.

ఈ  నేపథ్యంలోనే ప్రముఖ బాక్సర్ ‘మహ్మద్ అలీ’ జీవితచరిత్ర ఆధారంగా ఒక వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచనలో రానా ఉన్నాడని అంటున్నారు. మహ్మద్ అలీ బాక్సర్ గా అనేక విజయాలను సాధించాడు. 21 ఏళ్ల పాటు వరుస విజయాలను అందుకున్న రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఆయన జీవితంలో అనేక మలుపులు .. గెలుపులు ఉన్నాయి. ఒక సినిమాకి .. సిరీస్ కి తగిన కంటెంట్ ఉన్న జీవితం ఆయనది. రింగ్ లోనే కాదు .. నిజజీవితంలోను పోరాడిన యోధుడు ఆయన.

మహ్మద్ అలీ జీవితాన్ని ఆధారం చేసుకుని హాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలలో తన పాత్రలో తానే స్వయంగా నటించడం విశేషం. ఆయన జీవితంలో స్ఫూర్తిని పొందే కోణాలు ఎన్నో ఉన్నాయి. అందువలన ఆయన బయోపిక్ ను వెబ్ సిరీస్ గా అందించే ఆలోచనలో రానా ఉన్నాడని అంటున్నారు. ఈ సిరీస్ లో రానా నటిస్తాడా? కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్