Tuesday, June 9, 2026
Homeసినిమాపుష్ప ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్

పుష్ప ‘దాక్కో దాక్కో మేక’ వీడియో సాంగ్ రిలీజ్

Dakko Dakko Video Song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ సినిమా సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా రికార్డ్ క‌లెక్షన్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం. బాలీవుడ్ లో 13 రోజుల్లోనే 45 కోట్లు క‌లెక్ట్ చేసి స‌న్సేష‌న్ క్రియేట్ చేసింది. అక్కడ కేజీఎఫ్ మూవీ ఫుల్ ర‌న్ క‌లెక్షన్స్ ను పుష్ప 13 రోజుల్లోనే క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఊర మాస్ క్యారెక్టర్ లో బన్నీ యాక్టింగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తోంది. ఇక  చిత్తూరు యాసలో బన్నీ తగ్గేదే లే అంటుంటే కలక్షన్ల వర్షం కురుస్తుంది.

ఇక ఈ సినిమాకు బన్నీ నటనతో పాటు దేవీశ్రీ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయ్యింది. సుకుమార్ సినిమాకు దేవీ అందించే సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాలో దాక్కో దాక్కో మేక లిరికల్ సాంగ్ ను అన్నింటి కంటే ముందే రిలీజ్ చేశారు. ఈ పాట విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది. మిలియన్ కొద్దీ వ్యూస్ తో లైక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ రోజు ఈ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాట వినడానికే కాదు విజువల్ పరంగాను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళుతుంది. మ‌రి.. ఎలాంటి రికార్డ్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Watch :

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular