Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే దళితబందు పధకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రోజునే దళిత తెలంగాణ,హరిత తెలంగాణ,కోటి ఎకరాల మగణాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారని ఆయన వెల్లడించారు. హరిత తెలంగాణ కళ్లెదుటే సాక్షాత్కరిస్తుందని కోటి ఎకరాల మాగణం సస్యశ్యామలం అన్నది వరి దిగుబడి తేటతెల్లం చేసిందని మిగిలిన దళిత తెలంగాణ కోసం దళిత రూపంలో అడుగులు పడ్డాయని ఆయన తెలిపారు.
దళితబందు పధకం అమలులో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న భోనగిరియదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమఱ్ఱి గ్రామంలో దళితబందు లబ్ధిదారులకు ఆయన యూనిట్లు పంపిణీ చేశారు.స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి,జిల్లా ప్రజారిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమఱ్ఱి గ్రామంలో ఎంపిక చేసిన తొలి పదిమంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి యూనిట్ల ను పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ…..

ఒక నాడు తెలంగాణా ఒక స్వప్నం అని,కలలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారని కానీ అవి నిజం చేసే వాళ్ళు కొందరే ఉంటారని ఆ కొందరు మహానుభావులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరని కొనియాడారు. దళితబందు కేవలం కుటుంబానికో పది లక్షలు ఇచ్చే పధకం ఎంత మాత్రం కాదని ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శనంగా నిలబడే పధకం గా రూపొదిద్దు కుంటుందని ఆయన అన్నారు. దళితబందు పథకాన్ని ప్రపంచానికే ఓ రోల్ మోడల్ పధకం గా రూపొందించారని ఆయన చెప్పారు. ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని అన్నివర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని ఆయన పేర్కొన్నారు. భిన్న వైరుధ్యాలతో ఉండే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ఆచరణలో దళితబందు పథకాన్ని విజయవంతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశంతో పాటు మరెన్నో దేశాలకు స్వతంత్రం సిద్దించినా అనతి కాలంలోనే ఎన్నో దేశాలు చిన్నా బిన్నం అయ్యాయన్నారు. భారతదేశం ఇప్పటికి నిలదొక్కుకున్నది అంటే అందుకు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. అందుకే మహాత్మాగాంధీ, అంబేద్కర్ ల కలల సాకారానికై ముఖ్యమంత్రి కేసీఆర్ తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అన్నార్తులు,అనాధాలు లేని అద్భుతమైన సమాజం నిర్మాణానికి పునాదులు వేస్తున్నారన్నారు. అందులో భాగమే దళితబందు పధకమని తద్వారా ఆర్థిక వెనుకబాటుతనం తో పాటు సామాజిక అంతరాలు రూపొందించేందుకు బ్రహ్మ ష్ట్రం లా ఉపయోగ పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో వచ్చిన రంజాన్ పండుగకు అధికారికంగా ఇఫ్తార్ ఇవ్వాలని నిర్ణయిస్తే అందరూ వణికిపోయారన్నారు. ఇఫ్తార్ మాత్రమే కాకుండ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకేసి రంజాన్ కు నూతన వస్త్రాల ప్రధానం అన్న రోజున చాలా మంది ఓట్లతో లెక్కలేసి ఆలోచనలు చేశారన్నారు. మనం చేసేది ధర్మబద్ధమైనది,న్యాయబద్ధమైనదని బావించినందునే అందరిని ఒప్పించి ఒక్క రంజాన్ కే పరిమితము చేయకుండా క్రిస్మస్, బతుకమ్మ లకు నూతన వస్త్రాలను అధికారికంగా అందజేసే సరికొత్త ఒరవడికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. అదే పద్దతిలో మొదలు పెట్టిన దళితబందు కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com