వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న తాము నిర్వహిస్తున్న ప్రజాగర్జన కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ పెట్టుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. పవన్ కి ఎంత అహంభావం…. తమ ప్రాంతం బాగుపడాలనే ఆకాంక్ష కోసం ఐదు కోట్ల మంది ప్రజలు తమ అభిప్రాయం, తెలియజేసే హక్కు లేదా అని రాజా ప్రశ్నించారు. ప్యాకేజీ తీసుకుని మీరు బాగుంటే సరిపోతుందా, ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నారని పవన్ ను ఉద్దేశించి నిలదీశారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కు దేశ చరిత్రలో ఏ నాయకుడికీ ఇవ్వనటువంటి చెప్పు దెబ్బ లాంటి తీర్పు ఇచ్చారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గులేదని, అందుకే బైటకు వచ్చి అప్పుడప్పుడూ ప్రవచనాలు చెప్తున్నారని దుయ్యబట్టారు.
అమరావతికి మద్దతుగా టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, వారిలో ఒక్కరు గెలిచినా తాను వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వనని ఛాలెంజ్ విసిరారు. బాబు ప్రణాళికలో భాగంగా రథయాత్రలు పాదయాత్రలు చేస్తున్నారని రాజా చెప్పారు.
Also Read : వైఎస్సార్సీపీకి 67లోపే: పవన్ కళ్యాణ్

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.