Sunday, January 19, 2025
HomeTrending Newsఇథియోపియాలో 338కి చేరిన మృతులు

ఇథియోపియాలో 338కి చేరిన మృతులు

Ethiopia : ఇథియోపియాలో జాతుల మధ్య తలెత్తిన ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో మృతి చెందినవారి సంఖ్య 338 కి చేరుకుందని ప్రధానమంత్రి అబ్హియ్ అహ్మద్ ప్రతినిధి బిల్లెనే సోయెం ప్రకటించారు. చనిపోయినవారంతా అమ్హారా తెగకు చెందిన వారేనని వెల్లడించారు. ఇథియోపియన్ తిరుగుబాటు బృందం అమ్హారా జాతి సభ్యులను ఊచకోత కోసింది. ఇథియోపియాలోని అతిపెద్ద ప్రాంతమైన ఒరోమియాలోని టోలే అనే గ్రామంపై ఒరోమో లిబరేషన్ ఆర్మీ సభ్యులు దాడితో భయానక వాతావరణం నెలకొంది.

ఒరోమో లిబరేషన్ ఆర్మీ(OLA) అని పిలువబడే తిరుగుబాటు సంస్థ. ఇథియోపియన్ ప్రభుత్వం OLAను తీవ్రవాద సంస్థగా గుర్తించింది. ఆఫ్రికాలో అత్యంత ఎక్కువ జనాభా గల రెండో దేశమైన ఇథియోపియాలో ఇటీవల కాలంలో జాతుల ఘర్షణలు పెరిగాయి. తాజాగా జరిగిన ఘటన అతిపెద్దదిగా స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.

ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మమ్మల్ని తరలించాలని అమ్హారా తెగ ప్రజలు కోరుతున్నారని షాంబెల్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇదిలా ఉంటే 2020 నవంబర్ నుండి ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఉత్తర ప్రాంతంలో తిగ్రేలో ప్రారంభమైన తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రయత్నించడం ప్రారంభించినప్పటి నుండి దేశంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఘోరమైన జాతి హింసలో ఈ దాడి ఒకటి అని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్