Sunday, January 19, 2025
HomeTrending Newsఆగష్టు16 నుండి రైతుల ఖాతాల్లో రుణమాఫీ

ఆగష్టు16 నుండి రైతుల ఖాతాల్లో రుణమాఫీ

ఆగష్టు 16 వ తేదీ నుంచే ఆరు లక్షల రైతుల ఖాతాల్లో 2006  కోట్లు జమ అవుతాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. బ్యాంకర్లు , ప్రభుత్వ అధికారులు‌ సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలన్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించిన మంత్రి. రైతుల రుణ మాఫీ పై 42 బ్యాంకులతో బీఆర్కే భవన్ లో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు.

రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధి దారుల ఫోన్లకు ఎస్.‌ఎం.ఎస్ వెళ్లాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. రైతు రుణ మాఫీతో పాటు కొత్త పంట రుణానికి అర్హులని ఆ‌ సందేశంలో  తప్పకుండా పేర్కొనాలి‌. సీఎం పేరున ఎస్ ఎం ఎస్  సందేశంతో పాటు సదరు బ్యాంకులు సైతం రైతులకు రుణ మాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలి. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణ మాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద‌ జమ చేయవద్దు. రైతులకు ఇబ్బందులు‌ సృష్టించవద్దని‌ స్పష్టమైన ఆదేశం. రుణ మాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం  ఇవ్వాలి.

ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు  సహకరించాలని, బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం అందించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. రైతుల‌ రుణ మాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్