Thursday, June 11, 2026
Homeస్పోర్ట్స్ఆర్చరీ మూడో రౌండ్ లోకి దీపికా

ఆర్చరీ మూడో రౌండ్ లోకి దీపికా

టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో మన దేశానికి చెందిన క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ వన్ ఆర్చర్ దీపికా కుమారి మూడో రౌండ్ లోకి ప్రవేశించారు. రెండో రౌండ్ లో అమెరికా క్రీడాకారిణి జెన్నిఫర్ మునికో ఫెర్నాండేజ్ పై 6-4 తేడాతో విజయం సాధించి 1/16 నుంచి 1/8 ఎలిమినేషన్ రౌండ్ లోకి ప్రవేశించింది.

అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో భూటాన్ కు చెందిన భూ కర్ణ పై 6-0 తేడాతో 1/32 రౌండ్లో విజయం సాధించి 1/16 రౌండ్ లోకి ప్రవేశించారు. దీపిక తన మూడో రౌండ్ మ్యాచ్ (1/8) శుక్రవారం ఉదయం ఆడనుంది. ఈ ఈవెంట్ ఫైనల్స్ కూడా శుక్రవారం నాడే జరగనున్నాయి.

నేటి ఉదయం జరిగిన మెన్స్ సింగిల్స్ విభాగంలో మన దేశ క్రీడాకారులు ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ రాయ్ లు 1/16 ఎలిమినేషన్ రౌండ్ లో వెనుదిరిగారు.  మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ జోడీ  శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో ఓటమి పాలయ్యారు. ఆర్చరీ విభాగంలో దీపికా పైనే అందరి ఆశలు నెలకొని ఉన్నాయి. ఆమె తప్పకుండా పతకం సాధిస్తారని క్రీడాభిమానులు గట్టి విశ్వాసంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular