Saturday, June 13, 2026
HomeTrending NewsYS Jagan: సిఎం జగన్ తో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ

YS Jagan: సిఎం జగన్ తో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ

కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి, ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి గిరిధర్‌ అరమణె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.  రాష్రంలో రక్షణ శాఖకు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌లపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రక్షణ శాఖ సంస్థలకు  రాష్ట్ర ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న సిఎం జగన్ హామీ ఇచ్చారు. గిరిధర్‌ను సన్మానించి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను సిఎం జగన్ అందజేశారు.

ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మచిలీపట్నంలో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ పరిశీలనకు వెళ్ళిన గిరిధర్, అక్కడ జరిగిన ఎన్‌సీసీ పునిత్‌ సాగర్‌ అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular