Sunday, June 7, 2026
Homeసినిమామెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం

మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు అని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మెగాభిమాని డెక్కల గంగాధర్ ఎవరూ ఊహించని పని చేశారు. మెగాస్టార్ చిరును కలిసేందుకు తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువుకు చెందిన గంగాధర్ అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తూ వచ్చారు. అక్టోబర్ 3వ తేదీన కాలి నడకన హైదరాబాద్‌ బయలు దేరాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్‌ పేర్కొన్నారు. చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, కలిస్తే చాలని అదే పది వేలని భవిస్తూ 726 కి.మీ దూరం నడిచి హైదరాబాద్ వచ్చాడు.

ఈ వార్త తెలిసిన చిరంజీవి చలించిపోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్ తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే.. తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular