Tuesday, January 21, 2025
Homeస్పోర్ట్స్WPL: గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం

WPL: గుజరాత్ పై ఢిల్లీ ఘన విజయం

విమెన్ ప్రీమియర్ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ ఇచ్చిన 106 పరుగుల లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే ఢిల్లీ ఛేదించింది. షఫాలీ వర్మ ఈ మ్యాచ్ లో తన సత్తా ప్రదర్శించి 28 బంతుల్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 76;  కెప్టెన్ మెగ్ లన్నింగ్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులతో నాటౌట్ గా నిలిచి అద్భుత విజయం అందించారు.

డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 33 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లు మారిజాన్ కాప్, శిఖా పాండే బౌలింగ్ ధాటికి గుజరాత్ బ్యాటింగ్ లైనప్ కకావికలం అయ్యింది, దీనితో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 105 పరుగులే చేసింది. కిమ్ గ్రాత్-32(నాటౌట్); హర్లీన్ డియోల్-20; వారేహాం-22 మాత్రమే రాణించారు.

కాప్ 5; శిఖా 3; రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్