Saturday, June 13, 2026
HomeTrending Newsదేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోంది : మంత్రి వేముల

దేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోంది : మంత్రి వేముల

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు ఢిల్లీలో ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఢిల్లీకి వస్తారని తెలిపారు. మరోవైపు.. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా వస్తారని తెలిపారు. కేవలం ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. తాను కేసీఆర్ కు సైనికుడిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రజలకు సాగు, తాగు నీరును ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికీ ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని నిలదీశారు. ధనవంతుడు ధనవంతుడుగా ఎదుగుతూనే ఉన్నాడని అన్నారు. భారతదేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోందని ఆరోపించారు.

మరోవైపు.. రేపు మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాలకు బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించామని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : మోడీని ఎదిరించే దమ్మున్న నేత కేసిఆర్  ప్రశాంత్ రెడ్డి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular