Thursday, March 12, 2026
Homeస్పోర్ట్స్IPL: ఎట్టకేలకు ఢిల్లీ విజయం

IPL: ఎట్టకేలకు ఢిల్లీ విజయం

ఐపీఎల్ ఈ సీజన్ లో ఐదు వరుస  పరాజయాలతో డీలాపడిన ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై నాలుగు వికెట్లతో విజయం సాధించింది. రెండేళ్ళ తర్వాత మళ్ళీ గ్రౌండ్ లో అడుగు పెట్టిన ఢిల్లీ ఆటగాడు ఇషాంత్ శర్మ రెండు  వికెట్లు తీసి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఒక గంట ఆలస్యంగా మొదలైంది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా 50 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైంది. జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్-43; ఆండ్రీ రస్సెల్-38; మన్ దీప్-12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నార్త్జ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా రెండు; ముఖేష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్యం స్వల్పమే అయినా ఢిల్లీ చెమటోడాల్సి వచ్చింది. కెప్టెన్ వార్నర్-51; మనీష్ పాండే-21; అక్షర్ పటేల్-19 (నాటౌట్) పరుగులతో రాణించారు, 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపు సొంతం చేసుకుంది.

కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, నితీష్ రానా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular