Sunday, January 19, 2025
HomeTrending Newsపంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ మార్పు కోరుతోంది: కేజ్రివాల్

పంజాబ్ ప్రజలు మార్పు కోరుతున్నారని, వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే ఏకైక ఆశాకిరణం ఆమ్ ఆద్మీ పార్టీయేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు. ఇంతకాలం పంజాబ్ ను పరిపాలించిన పార్టీలు ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో విఫలమయ్యారని, రాబోయే ఎన్నికల్లో పంజాబ్ ప్రజలు తమ పార్టీకి పట్టం కడతారని కేజ్రివాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సోమవారం పంజాబ్ లో అయన పర్యటించనున్న కేజ్రివాల్ అమృత్ సర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.  మాజీ పోలీసు ఉన్నతాధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ కేజ్రివాల్ సమక్షంలో ఆప్ లో చేరనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, పంజాబ్ ఏక్తా పార్టీకి సారధ్యం వహిస్తున్న సుఖ్ పాల్ సింగ్ కైరా కాంగ్రెస్ లో చేరారు.  రాబోయే ఎన్నికల్లో కైరా తిరిగి సొంత గూటికి చేరుకుంటారని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న కేజ్రివాల్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు.

2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 117 సీట్లకు గాను ఆ పార్టీ కేవలం 20 సీట్లు మాత్రమే గెలవ గలిగింది. కాంగ్రెస్ 77సీట్లతో అధికారం సంపాదించగా, అకాలీదళ్, బిజెపి కూటమి కూటమి 18 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి బైటకు వచ్చి బిఎస్పీ తో పొట్టు పెట్టుకుంది. కాంగ్రెస్,  అకాలీదళ్, బిజెపి, ఆప్ ల మధ్య చతుర్ముఖ పోరు జరిగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్