Friday, June 12, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్సోషల్ మీడియా ప్రభావం: 15 నిమిషాల్లో సర్టిఫికేట్

సోషల్ మీడియా ప్రభావం: 15 నిమిషాల్లో సర్టిఫికేట్

తన తల్లి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలంటూ నోషిత అనే యువతి సిఎం జగన్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. రాష్ట్ర డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో 15 నిమిషాల వ్యవధిలోనే ఆ బాలికకు సర్టిఫికేట్ అందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు నివాసి పొణకా అనుపమ న్యాయశాఖలో చిరు ఉద్యోగిగా పనిచేస్తూ గత నెల 2న గుండెపోటుతో మృతిచెందారు.  ఆమె కుమార్తె నోషిత (15) తన తల్లి డెత్ సర్టిఫికేట్ ఇప్పించాలంటూ అధికారులను సంప్రదించారు.

అనుపమ కరోనాతో మరణించారన్న వార్తలతో అల్లూరు నగర పంచాయతీ అధికారులు డెత్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. విచారణ నిమిత్తం కావలి మున్సిపల్‌ కార్యాలయానికి పంపించామని చెప్పారు. ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరిగినా తల్లి మరణ ధృవీకరణ పత్రం రాకపోవడంతో తీవ్ర నిస్పృహకు గురైన బాలిక… రిజిస్టరు పోస్టులో నేరుగా ముఖ్యమంత్రికి లేఖ పంపింది.

”జగన్‌ మామయ్యా..! చిన్నప్పుడే తండ్రికి దూరమయ్యాను. కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మైనర్‌ని అయిన నేను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేధిస్తున్నారు. విసిగిపోయి మానసికంగా కుంగిపోయాను” అంటూ లేఖ రాసింది.

దీనిపై సత్వరమే స్పందించిన ఆళ్ల నాని వెంటనే నెల్లూరు జిల్లా DMHO, జడ్పీ సీఈఓలతో ఫోన్లో మాట్లాడి సర్టిఫికేట్ అందించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular