Sunday, January 19, 2025
Homeజాతీయంమూడో దశను ఎదుర్కొంటాం : అరవింద్ కేజ్రివాల్

మూడో దశను ఎదుర్కొంటాం : అరవింద్ కేజ్రివాల్

కరోనా మూడో దశ ఎర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 420 టన్నుల ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచామని, మరో 150 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయాల్సిందిగా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ను కోరామని చెప్పారు. కరోనా కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు కనుగొనేందుకు ఢిల్లీ లో రెండు జినోమ్ సీక్వెన్సింగ్ లాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

సోమవారం నుంచి ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పని చేసుకోవచ్చని, ప్రభుత్వ ఆఫీసుల్లో ‘ఏ’ గ్రూప్ స్టాఫ్ అందరూ హాజరు కావాలని, ‘బి’ గ్రూప్ సిబ్బంది 50 శాతం హాజరు కావాలని సూచించారు. నగరంలో మెట్రో రైల్ సేవలు మొదలవుతాయని, 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. కంప్యూటర్ హార్డ్ వేర్ షాపులకు ఎలాంటి నిబంధనలు లేవని, ఉదయం 10 నుంచి రాత్రి గంటల వరకూ తెరుచుకోవచ్చన్నారు. ఈ-కామర్స్ సేవలు కొనసాగుతాయన్నారు.

లాక్ డౌన్ జూన్ 14 వరకూ కొనసాగుతుందని, కాకపొతే మరిన్ని సడలింపులు ఇస్తున్నామని, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సరి – బేసి సంఖ్యలో నడుస్తాయని కేజ్రివాల్ వివరించారు. కరోనా పూర్తిగా అదుపులో ఉందని, కేసుల సంఖ్య తగ్గుతున్న కొద్దీ మరిన్ని సడలింపులు ఇస్తామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్