Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్కేజ్రివాల్ తో కరణం మల్లేశ్వరి భేటి

కేజ్రివాల్ తో కరణం మల్లేశ్వరి భేటి

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా నియమితులైన తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కరణం మల్లేశ్వరి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కేజ్రివాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒలింపిక్స్ స్థాయి అథ్లెట్లను తయారు చేయడమే లక్ష్యంగా దీన్ని నెలకొల్పారు. ఈ ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయానికి మొదటి వైస్- ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించారు. ఈ మేరకు నిన్న రాత్రి ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

‘స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రారంభంతో మా కల సాకారమైంది. ఒలింపిక్స్ పతకం సాధించిన కరణం మల్లీశ్వరి తొలి వీసీ కావడం ఎంతో గర్వకారణం’ అని కేజ్రివాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని, తెలుగు ఖ్యాతిని ఇనుమడింప జేశారు. ఆమె నియామకం పట్ల పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్