Thursday, April 18, 2024
HomeTrending Newsటీకా పంపిణీలో మహిళలకు ప్రాధాన్యత

టీకా పంపిణీలో మహిళలకు ప్రాధాన్యత

వ్యాక్సినేషన్ లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్ళ లోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యెక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ రోజు ఆదేశాలు జారి చేశారు. కోవిడ్-19 మూడో దశ రాబొతుందన్న వార్తలతో  ప్రభుత్వం ముందు  జాగ్రత్త చర్యలు చేపట్టిందని సిఎం వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం కరోన కేసులు తగ్గుముఖం పట్టాయని మమత బెనర్జీ తెలిపారు. రోజు వారి పాజిటివ్ కేసులు 3.61 శాతంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడు, ఎనిమిది దశల్లో కేసులు అధికంగా ఉన్నాయని, రెండు దశలు కలిపి ఎన్నికలు నిర్వహించాలని తృణముల్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినా ఎన్నికల కమిషన్, కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు.

కోవాక్జిన్ టీకా వాళ్ళ కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని మమత బెనర్జీ తెలిపారు. కోవాక్జిన్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గుర్తించక పోవటంతో విదేశాలకు వెళ్ళే వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం వెళ్ళే బెంగాల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని బెంగాల్ సిఎం మమత సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్