Delhi in Fray: ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో ఢిల్లీ నిలిచింది. నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 17 పరుగులతో విజయం సాధించి తదుపరి రౌండ్ లో బెర్త్ కోసం తర్వాతి మ్యాచ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
పరుగుల ఖాతా తెరవకముందే ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్-మిచెల్ మార్ష్ లు రెండో వికెట్ కు 51 పరుగులు జోడించారు, 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 32 పరుగులు చేసి సర్ఫరాజ్ ఔటయ్యాడు. లలిత్ యాదవ్-24 చేయగా, పంత్-7; పావెల్ -2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. మార్ష్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 63పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. చివర్లో అక్షర్ పటేల్ 17 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, అర్ష్ దీప్ సింగ్ చెరో మూడు; రబడ ఒక వికెట్ పడగొట్టారు.
ఓవర్ కు 8 పరుగుల రన్ రేట్ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 38 పరుగులకు తొలి వికెట్ (బెయిర్ స్టో-28)కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 19 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. భానుక రాకపక్ష-4; లివింగ్ స్టోన్-3; కెప్టెన్ మయాంక్ అగర్వాల్-డకౌట్…. విఫలమయ్యారు. జితేష్ శర్మ 34 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 చేసి అవుట్ కాగా; రాహుల్ చాహర్-25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఢిల్లీ బౌలింగ్ లో 18 ఓవర్లో శార్దూల్ ఠాకూర్ 10 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా, 19 వ ఓవర్లో నార్త్జ్ కేవలం మూడు పరుగులే ఇవ్వడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ నాలుగు, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు; నార్త్జ్ ఒక వికెట్ పడగొట్టారు
శార్ధూల్ ఠాకూర్ కు ‘మ్యాన్ అఫ్ దమ్యాచ్’ దక్కింది.