ఐపీఎల్ ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకూ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. నేడు జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) బెంగుళూరు పై 23 పరుగుల తేడాతో ఓటమి పాలైంది, ఢిల్లీకి ఇది వరుసగా ఐదో పరాజయం.
బెంగుళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తొలి వికెట్ (డూప్లెసిస్-22)కు 42 పరుగులు చేసింది. కోహ్లీ వేగంగా ఆడి 34 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 రన్స్ చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. లామ్రోర్-26; గ్లెన్ మాక్స్ వెల్-24; షాబాజ్ అహ్మద్-20 పరుగులు చేశారు. హర్షల్ పటేల్(6); దినేష్ కార్తీక్ (డకౌట్) విఫలమయ్యారు. అర్జున్ రావత్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్, కుల్దీప్ యాదవ్ చెరో రెండు; అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్య సాధనలో ఢిల్లీ ఒక పరుగు వద్ద రెండు వికెట్లు (పృథ్వీ షా, మిచెల్ మార్ష్ డకౌట్) కోల్పోయింది. రెండో పరుగు వద్ద మరో వికెట్ (యష్ ధూల్-1) కోల్పోయింది, 19 పరుగులు చేసిన కెప్టెన్ వార్నర్ 19రన్స్ చేసి ఔటయ్యాడు, 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. మనీష్ పాండే అర్ధ సెంచరీ (38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో50) తో రాణించాడు. అక్షర్ పటేల్-21; హకీమ్ ఖాన్-18; నార్త్జ్-23పరుగులు చేశారు, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయగలిగింది.
విజయ్ కుమార్ వ్యాసక్ మూడు; సిరాజ్ రెండు; పార్నెల్, హసరంగ, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
విరాట్ కోహ్లీ కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.