Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం

ఐపీఎల్: ఢిల్లీ క్యాపిటల్స్ అనూహ్య విజయం

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్  అద్భుత విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో పది బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లతో గెలుపొంది సత్తా చాటింది. 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దాదాపు ఖాయమనుకున్న తరుణంలో లలిత్ యాదవ్-48 (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు); అక్షర్ పటేల్-38 (17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులతో ఆరో వికెట్ కు 75  పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి విజయం అందించారు.

ముంబై లోని బార్బౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ లు తొలి వికెట్ కు 67 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ 48 పరుగులు (32బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్  కేవలం 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి పొట్టి ఫార్మాట్ లో తన సత్తా మరోసారి చాటాడు. మిలిగిన వారిలో తిలక్ వర్మ 22 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో కులదీప్ యాదవ్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు సాధించారు.

భారీ లక్షంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభం బాగానే ఉన్నానాలుగో ఓవర్లో జట్టు స్కోరు 30 వద్ద ఒకేసారి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టిమ్ స్టీఫెర్ట్ -21 పరుగులు చేయగా, మన్ దీప్ సింగ్ డకౌట్ గా వెనుదిరిగారు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ రిషభ్ పంత్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 10వ ఓవర్లో పృథ్వీ షా-38; పావెల్(డకౌట్) ఇద్దరూ ఔటయ్యారు. ఈ సమయంలో లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్  వీర విహారం చేసి, 18.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులతో విజయం అందించారు.

ముంబై బౌలర్లలో బసిమ్ తంపి మూడు, మురుగన్ అశ్విన్ రెండు, తైమల్ మిల్స్ ఒక వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లు సాధించిన ఢిల్లీ బౌలర్ కుల్ దీప్ యాదవ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్