Sunday, September 8, 2024
HomeTrending NewsTPCC: కెసిఆర్ వ్యతిరేక పునరేకీకరణ - రేవంత్ రెడ్డి

TPCC: కెసిఆర్ వ్యతిరేక పునరేకీకరణ – రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్లు రవితో కలిసి హైదరాబాద్ లో  జూపల్లి, పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్లారు. మొదట జూపల్లి ఇంటి దగ్గర లంచ్ చేసి..వర్తమాన రాజకీయాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో సీనియర్ నేత గురునాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రాజేశ్, మేఘా రెడ్డి తదితరులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత పొంగులేటి నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి సుదీర్గంగా చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి నేతలు తిరిగి పార్టీలోకి రావాలని, తగిన ప్రాధాన్యం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలన్నా, నిధులు విడుదల కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని స్పష్టంచేశారు. రాజకీయ వ్యతిరేక పునరేకీకరణ జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనార్టీలకు మేలు జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చని చాలా మంది నిరసన గళం వినిపిస్తున్నారని పేర్కొన్నారు.

 

2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమన్నారు. తెలంగాణలో 17పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జూపల్లి కృష్ణారావు.. కొల్లాపూర్, మహబూబ్ నగర్ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జూపల్లితోపాటు దామోదర్ కుటుంబ సభ్యులు, గురునాథ్ రెడ్డి పార్టీలో చేరాలని కోరామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ అతీ గతీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినప్పటికీ 2 లక్షల కోట్ల ఖర్చు చేశారని విమర్శించారు. జూపల్లి బృందం పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని.. మిగతా మిత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాలుగున్నరేళ్ల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి వచ్చామని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి పాలించే నైతిక అర్హత లేదన్నారు. అమరవీరుల ఆకాంక్ష నెరవేరలేదని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలు, అవినీతి పెరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో దుర్గార్మ నియంతృత్వ పాలన కొనసాగుతోందని చెప్పారు. పాలమూరు ప్రాజెక్ట్ ఇప్పటివరకు ముందడుగు పడలేదన్నారు.

నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. వందల మంది ప్రాణత్యాగం చేసింది.. బంగారు తెలంగాణ కోసం పోరాడితే కొందరికీ పరిమితం అయ్యిందని చెప్పారు. తెలంగాణ ద్రోహుల చేతిలో అధికారం హస్తగతం అయ్యిందన్నారు. కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయని.. అందరినీ సంఘటితం చేసి ముందడుగు వేస్తామని చెబుతున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి.. ధరణి పోర్టల్ సంస్కరణలు.. పేదలు, అసైన్డ్ ల్యాండ్ ఉన్నవారికి పాస్ బుక్, రైతు బంధు లేదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్