Saturday, January 18, 2025
Homeసినిమా'డెవిల్' ఏమైంది..?

‘డెవిల్’ ఏమైంది..?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డిఫరెంట్ మూవీస్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్టార్ట్ చేసి సరికొత్త కథలతో సినిమాలను నిర్మిస్తున్నారు. ఇలా ఓ వైపు కథానాయకుడుగా, మరో వైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు కళ్యాణ్ రామ్. అతనొక్కడే సినిమాతో కెరీ్ర్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఒక్కసారిగా ఆడియన్స్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ జనాలు కూడా ఆయన వైపు చూసేలా చేశారు. ఆతర్వాత హరే రామ్, కత్తి, ఓం తదితర చిత్రాలు అందించాడు కానీ.. ఆశించినట్టుగా విజయాల్ని అందివ్వలేకపోయాయి.

ఇటీవల బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించించాడు. సోషియో ఫాంటసీ మూవీగా రూపొందిన బింబిసార మూవీతో మళ్లీ హీరోగా ఫామ్ లోకి వచ్చాడు. అయితే.. ఆతర్వాత చేసిన ప్రయోగాత్మక చిత్రం అమిగోస్ సరిగ్గా ఆకట్టుకోలేకపోయింది. నెక్ట్స్ కళ్యాణ్ రామ్ నుంచి రానున్న మూవీ ‘డెవిల్’. ఈ చిత్రానికి నవీన్ మేడారం డైరెక్టర్ అని ప్రకటించారు. అయితే.. ఆతర్వాత ఏమైందో ఏమె కానీ.. డైరెక్టర్ నవీన్ మేడారం కాకుండా నిర్మాణ సంస్థ పేరు వేశారు. సినిమా ప్రకటించినప్పుడు నవీన్ మేడారం అని టైటిల్ కార్డ్ వేసి ఆతర్వాత తీసేయడంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అయ్యింది.

డెవిల్ మూవీని నవంబర్ 24న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. తన పేరు తీసేయడంతో డైరెక్టర్ నవీన్ మేడారం కోపంగా ఉన్నారని.. అసోషియేషన్ లో తేల్చుకోవాలి అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే.. ఈ పంచాయితీ అక్కడ వరకు వెళ్లకుండానే పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. ఈ సినిమా రిలీజ్ కి నెల రోజులే టైమ్ ఉంది కానీ.. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో డెవిల్ ఏమైంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. డెవిల్ ఏం చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్