Sunday, January 19, 2025
HomeTrending Newsజవాబు చెప్పలేక ఎదురుదాడి: దేవినేని

జవాబు చెప్పలేక ఎదురుదాడి: దేవినేని

కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పందికొక్కుల్లా దోచుకున్నారని, మట్టి పనుల్లో కూడా డబ్బులు దండుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గత ఐదేళ్ళలో  తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల పనులు చేశామో మంత్రి రాంబాబు తెలుసుకోవాలని హితవు పలికారు.

వరదలతో ప్రజలు అల్లాడుతుంటే అధికార పార్టీ నేతలు ఎక్కడున్నారని ఉమా ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న హెలికాప్టర్ ద్వారా బాధితులకు మంచినీరు, నిత్యావసరాలు, వస్తువులు పంపొచ్చు కదా అని నిలదీశారు. తమ పార్టీ నేతలు చిన రాజప్ప, రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి అక్కడ ప్రజలతో మమేకమై పని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. తనపై అంబటి రాంబాబు చేసిన విమర్శలపై ఉమా తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఆవేదనతో అన్నీ నిజాలు చెబుతుంటే ఓర్వలేక, చంద్రబాబును, తనను, మీడియాను బూతులు తిట్టడంసరికాదని హితవు పలికారు.  పరిసర రాష్ట్రాల నుంచి, ఎగువ రాష్ట్రాల నుంచి ఎంత వరద వస్తుంది, ఫోర్ కాస్ట్ ఏమిటనే దానిపై ఒక అవగాహన కూడా సిఎం, మంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. 2019లో 15లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు ఇదే స్పిల్ వే మీద పడి స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ ద్వారా సముద్రంలో కలిసిందని, 2020లో 23లక్షల క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని తాను అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఉమా ధ్వజమెత్తారు.

సిఎం గా జగన్ పదవి చేపట్టిన తర్వాత పోలవరంపై జరిపిన మొదటి సమీక్షలో నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు స్పష్టంగా చెప్పారని, కానీ దానిపై నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అడ్డదిడ్డంగా మాట్లాడడం  ఏమిటన్నారు. గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పోలవరం వచ్చి తల బాదుకొని వెళ్ళారని, దమ్ముంటే ఆ సమీక్ష మినిట్స్ బైట పెట్టాలని డిమాండ్ చేశారు.

Also Read : ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్