Digital Learning In Gurukul Residentials In Telangana :
మంత్రి గంగుల అధ్యక్షతన 2022-23 విద్యా సంవత్సర బీసీ గురుకులాల బోర్డు మీటింగ్ మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ వెనుకబడిన వర్గాల సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు మీటింగ్ ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య బట్టు ఇతర డైరెక్లర్లు హాజరైన ఈ కార్యక్రమంలో 2022 -23 సంవత్సరానికి సంబందించిన ముఖ్య అంశాలను ఆమోదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి సంక్షేమం కోసం అనేక విదాలుగా క్రుషి చేస్తున్నారని గతంలో దాదాపు 16 గురుకులాల ద్వారా కొద్ది మందికి మాత్రమే విద్యను అందించారని ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ ఏర్పాటు తర్వాత నేడు 281 బీసీ గురుకులాల్లో వేలాదిమంది విధ్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు మంత్రి గంగుల. ముఖ్యంగా విధ్యార్థులకు వేడినీటితో స్నానం చేసే అవకాశాలు కల్పించడం కోసం టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ప్రతీ గురుకులంలో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాధనకు అందరూ ముక్త కంఠంతో ఆమోదించారు. మొన్నటి బాన్సువాడ బీర్కూర్ స్కూల్ శంకుస్థాపనలో ఇచ్చిన హామీని మంత్రి గంగుల నెరవేర్చారు.
విధ్యార్థులకు నాణ్యమైన విధ్యను అందించే లక్ష్యంలో బాగంగా 281 గురుకులాల్లో ఉన్న 1276 డిజిటల్ క్లాస్ రూం, ఈ లెర్నింగ్ క్లాస్ రూంలను ఈ సంవత్సరానికి పెంచుతూ 1696 క్లాస్ రూంలలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. గురుకులాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అకడమిక్ సెల్, ఇంటర్నల్ ఆడిట్ టీంలను మరింత బలపర్చడమే కాకుండా, హైజీనిక్, బిల్డింగ్ అప్పియరెన్స్, పుడ్ క్వాలిటీ అస్యూరెన్స్ తదితర కమిటీల ద్వారా అన్ని అంశాలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానించింది.
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల, ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, టీఎస్ రెడ్కో చైర్మన్ జానయ్య తో పాటు బోర్డు సభ్యులు గురుకులాల కార్యదర్శి మల్లయ్యబట్టు, ఈ డబ్యుఐడీసి ఎండి పార్థసారథి, ఫైనాన్స్ డిపార్మెంట్ డీఎస్ రూపారాణి, డైరెక్టర్ ఎస్సీఈఆర్టీ రాధారెడ్డి, సెక్రటరీ టీఆర్ఈఐఎస్ రమణ కుమార్, స్కూల్ ఎడ్యుకేషన్ జేడీ రాజీవ్. తదితరులు పాల్గొన్నారు