Friday, March 29, 2024
Homeసినిమాదిల్ రాజు రిలీజ్ చేస్తున్న ‘లవ్ టుడే’

దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ‘లవ్ టుడే’

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ల‌వ్ టుడే’. ఇవ‌నా హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. రోమ్ కామ్ మూవీగా రూపొందిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి నిర్మాత దిల్‌ రాజు సిద్ధ‌మ‌య్యారు.  న‌వంబ‌ర్ మూడో వారంలో సినిమాని భారీగా విడుద‌ల చేయ‌టానికి దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు.

2019లో రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన కోమాలి సినిమాను ప్ర‌దీప్ రంగ‌నాథ్ తెర‌కెక్కించారు. ల‌వ్ టుడే అయ‌న రెండో సినిమా. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు హీరోగానూ ఆయ‌నే న‌టించారు. త‌మిళంలో గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ల‌వ్ టుడే చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. స‌త్య‌రాజ్‌, రాధికా శ‌ర‌త్ కుమార్ పోషించిన ప్ర‌ధాన పాత్ర‌లు సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారాయి. సినిమా బ‌డ్జెట్ కంటే ప‌ది రెట్లు లాభాన్ని సాధిస్తుంద‌ని కోలీవుడ్ సినీ వ‌ర్గాలంటున్నాయి. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సినిమా బాగా క‌నెక్ట్ అయ్యింది. ఎ.జి.ఎస్‌.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌ పై ల‌వ్ టుడే చిత్రాన్ని క‌ల్పతి అఘోరాం, క‌ల్పతి ఎస్‌.గ‌ణేష్ నిర్మించారు. మ్యూజిక్ సంచ‌ల‌నం యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్