Friday, March 29, 2024
Homeసినిమాబిజీ బిజీగా 'బింబిసార' డైరెక్టర్

బిజీ బిజీగా ‘బింబిసార’ డైరెక్టర్

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘బింబిసార’. ఈ చిత్రం ద్వారా వశిష్ట్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.  అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో వశిష్ట్ తో సినిమాలు చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్స్, హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. బింబిసార బ్లాక్ బస్టర్ అవ్వడంతో  దీనికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఆగష్టులో బింబిసార 2 రిలీజ్ చేసేలా ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని  అఫిషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.

ఇదిలా ఉంటే..శిష్ట్  లైన‌ప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈమ‌ధ్యే సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఓ క‌థ చెప్పొచ్చాడు. వశిష్ట్ ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ కి కథ చెప్పడం ఏంటి అని ఇండస్ట్రీలో చాలా మంది షాక్ అయ్యారు కానీ.. ఇది నిజమని తెలిసింది. ఈ కాంబో దాదాపుగా ఖ‌రారైపోయిన‌ట్టే అని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఈలోగా మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ని కూడా లైన్‌లో పెట్టాడు. ఇటీవ‌ల చ‌ర‌ణ్, వ‌శిష్ట మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయి. త‌న ద‌గ్గ‌ర ఉన్న క‌థ‌ల్లో చ‌ర‌ణ్‌కి స‌రిప‌డా స‌బ్జెక్ట్ గురించి వివరించాడట.

ఈ క‌థ కూడా బింబిసార‌లా సోషియో ఫాంట‌సీనే అని స‌మాచారం. చ‌ర‌ణ్‌కి ఈ క‌థ బాగా న‌చ్చింద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించే అవ‌కాశాలున్నాయి. అలాగే గీతా ఆర్ట్స్‌లో వ‌శిష్ట ఓ సినిమా చేయాలి. హీరో కూడా దాదాపుగా ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఈ నెలాఖ‌రున‌ ఈ కాంబోకి సంబంధించిన వివ‌రాల్ని ప్ర‌క‌టిస్తారు. మొత్తానికి బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో డైరెక్టర్ వశిష్ట్ సూపర్ లైనప్ తో ఫుల్ బిజీ అయ్యాడు. మరి.. ఈ సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్