Monday, June 15, 2026
Homeసినిమా'లైగర్' పరాజయంపై విజయ్ కామెంట్స్

‘లైగర్’ పరాజయంపై విజయ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొంది, భారీ అంచనాలతో రిలీజైన లైగర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో విజయ్, పూరి కలిసి చేస్తున్న మరో మూవీ జనగణమన ఆగిపోయింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఇక ఈ ప్రాజెక్ట్ లేనట్టే అంటున్నారు. విజయ్ నెక్ట్స్ మూవీ ఖుషి షూటింగ్ లో బిజీ అయ్యాడు.. పూరి నెక్ట్స్ మూవీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు.

లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ ఎక్కడా మాట్లాడలేదు కానీ.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో విజయ్ స్పందించాడు. ఇంతకీ.. లైగర్ ఫ్లాప్ గురించి విజయ్ ఏమన్నాడంటే.. లైగర్ తనని తాను వ్యక్తిగా, నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకునేలా చేసిందని, హీరోగా విజయ్ దేవరకొండ ఎటువంటి సినిమాలు చేయాలి, తన క్రేజ్ ఏంటి.. వంటి విషయాలు తనకు తెలిసివచ్చాయని అన్నారు. అయితే ఇప్పుడు ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒకింత ఆసక్తికరంగా మారాయి. లైగర్ ఘోర పరాజయం హీరోగా విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ ల సెలెక్షన్ పై పూర్తిగా ప్రభావం చూపించిందట.

అందుకే ఆయన జిజిఎమ్ మూవీని ప్రస్తుతం ప్రక్కన పెట్టారని, అలానే ప్రస్తుతం సమంతతో శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి మూవీ పై గట్టిగా ఫోకస్ పెట్టారని తెలిసింది. తదుపరి చేయనున్న ప్రాజక్ట్స్ విషయంలో కూడా బాగా కేర్ తీసుకుంటున్నారట. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఇంకా ఎవరికీ ఓకే చెప్పలేదు. ఎలాంటి కథలతో సినిమాలు చేయాలనే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

Also Read : ఆ వార్త‌ల‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఛార్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular