Friday, March 29, 2024
Homeసినిమానాగ‌చైత‌న్య‌తో ఊర మాస్ మూవీ చేస్తా : దిల్ రాజు

నాగ‌చైత‌న్య‌తో ఊర మాస్ మూవీ చేస్తా : దిల్ రాజు

Mass Chaitanya: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం థ్యాంక్యూ.  విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు. జోష్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో దిల్ రాజు నిర్మించిన చిత్ర‌మిది. ఈ మూవీ టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇందులో నాగ‌చైత‌న్య మూడు డిఫ‌రెంట్ లుక్స్ లో క‌నిపించ‌డం ఆస‌క్తిగా మారింది. విభిన్న ప్రేమ‌క‌థగా రూపొందిన థ్యాంక్యూ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. నాగ‌చైత‌న్య ఓ మాస్ మూవీ చేయాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. నాగ‌చైత‌న్య కూడా మాస్ మూవీ ట్రై చేశాడు. అయితే… ప్రేక్ష‌కులు మాత్రం నాగ‌చైత‌న్య‌ను ల‌వ్ స్టోరీస్ లోనే ఎక్కువుగా  చూడాలనుకుంటున్నారు, అందుకే చైతు ల‌వ్ స్టోరీస్  వైపే మొగ్గు చూపుతున్నాడు. అయితే.. అభిమానుల మ‌న‌సులో ఏముందో గుర్తించిన దిల్ రాజు చైత‌న్య‌తో ఊర మాస్ మూవీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

థ్యాంక్యూ మూవీ ట్రైల‌ర్ రిలీజ్  ఫంక్షన్ లో దిల్ రాజు మాట్లాడుతూ… ఖ‌చ్చితంగా నాగ‌చైత‌న్య‌తో ఊర మాస్ మూవీ చేస్తాన‌ని చెప్పి అభిమానుల్లో ఓ ఊపు తీసుకువ‌చ్చారు. ఎవ‌రైనా క‌థ రెడీ చేయండి అని కూడా ప్ర‌క‌టించారు. మ‌రి.. నాగ‌చైత‌న్య‌తో దిల్ రాజు నిర్మించే ఊర మాస్ మూవీని ఎవ‌రు డైరెక్ట్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్