Friday, March 29, 2024
HomeTrending Newsగోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

గోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్. ఎమ్మేల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామని NDRF బృందాలు వస్తున్నాయని తెలిపారు. రోజువారి వ్యవసాయ పనిలో భాగంగా బోర్నపల్లి కి చెందిన కూలీలు యధావిధిగా పనులకు ఉపక్రమించడంతో గత రెండు మూడు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదారి వరద ఉధృతి పెరగడంతో వరదలో చిక్కుకుపోయారు.

మరోవైపు రాయికల్ మండల బోర్నప్లలి గ్రామాని కి చెందిన 9 మంది కూలీల న్యూస్ కవరేజీ కి వెళ్ళిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఎన్ టివి రిపోర్టర్ జమీర్ తన వాహనంతో సహా వాగులో కొట్టుకుపోయారు. రామోజీ పెట్ భూపతి పూర్ వద్ద రోడ్డులో కారుతో సహా వరద ప్రమాదంలో గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కాగా స్థానిక నాయకులు,రిపోర్టర్ లు, పోలిస్ అధికారులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పై సమీక్షించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్