శ్రీలంక ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 73 ఏళ్ల దినేష్ గుణవర్దనే పొదుజన పెరుమన పార్టీకి చెందిన ఎంపిగా ఉన్నారు. కొలంబోలో నిరడంబంరంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమైన కొందరు నేతలు మాత్రమె హాజరయ్యారు. శ్రీలంక 15వ ప్రధానమంత్రిగా దినేష్ గుణవర్దనే సేవలు అందించనున్నారు. మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స హయంలో దినేష్ గుణవర్దనే శ్రీలంక హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
పేరుకు కొత్త ప్రభుత్వం అని చెపుతున్నా రాజపక్స హయంలోని నేతలే మళ్ళీ పదవులు స్వీకరిస్తున్నారని దేశ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రణిల్ విక్రమసింఘె దేశ అధ్యక్ష పదవి చేపట్టడంపై కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దినేష్ గుణవర్దనే కూడా రాజపక్స కు దగ్గరి నేత అని విమర్శలు వస్తున్నాయి. శ్రీలంక రాజకీయాలు కలుషితం అయ్యాయని, ఇప్పుడు ఉన్న నేతలు రాజీనామా చేస్తేనే కొత్త తరం వస్తుందని ఆందోళనకారులు అంటున్నారు.
మరోవైపు ఆందోళనకారుల శిభిరాలను లంక సైనికులు కుల్చివేశారు. నిన్నటి నుంచి కొలంబోలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దీక్ష శిభిరాలను సైన్యం తొలగించటం తాజాగా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. శ్రీలంక పార్లమెంటు సమావేశాలు ఈ నెల 27వ తేది నుంచి ప్రారంభం అయితే దేశంలో కొనసాగుతున్న సంక్షోభం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘె