విక్టరీ వెంకటేష్‌ కరోనా టైమ్ లో నారప్ప, దృశ్యం 2 చిత్రాల్లో నటించారు. అయితే.. ఆ రెండు చిత్రాలు థియేటర్లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా బాగానే ఆకట్టుకున్నాయి. ఇటీవల నటించిన ఎఫ్ 3 మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో సక్సెస్ సాధించారు. అయితే.. వెంకీ కెరీర్ లో మైలురాయిగా నిలిచే 75వ సినిమాకు చేరుకున్నారు. ఈ సినిమాను స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో చేయాలనుకుంటున్నారట.  ఈ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది.

హిట్, హిట్ 2 చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించనున్నారని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే.. తాజా వార్త ఏంటంటే… ఇంకా కన్ ఫర్మ్ కాలేదని శైలేష్ కొలను తో పాటు, శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్, బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, సంపత్ నంది రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ప్రొడ్యూస్ చేయడానికి వెంకట్ బోయనపల్లి, సూర్యదేవర నాగవంశీ,  జ్ఞాన వేల్ రాజా.. ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది.

ఇప్పటివరకు సంపత్ నంది ఒక్కడే కథ చెప్పారట. ఈ కథను ఓకే చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. తనకు సూటయ్యే కథనే ఫైనల్ చేయాలని వెంకటేష్  ఫిక్స్ అయ్యారట. కథ ఓకే అవ్వాలంటే సురేష్ బాబు వినాలి. వెంకటేష్ వినాలి. అందరికీ నచ్చాలి. ఇలా చాలా వ్యవహారాలు వున్నాయి. విదేశాల్లో ఉన్న వెంకీ వచ్చిన తర్వాత 75వ చిత్రంపై నిర్ణయం తీసుకుంటున్నారట. మరి.. కెరీర్ లో మరచిపోలేని మూవీని ఎవరితో చేస్తారో? ఎలాంటి సినిమా చేస్తారో? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *